అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | భారత్ (india) ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం (pakistan terror camps detroyed) చేయడంతో దాయదీ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో (drones, missiles and war planes) భారత్‌పై దాడులు చేస్తోంది. అంతేగాకుండా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ సాయుధ దళాలు (Pakistan armed forces) గురువారం అర్ధరాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి దాడులు చేశాయి. దీంతో భారత దళాలు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి (Indian forces repelled pakistan attacks). జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (Line Control in Jammu and Kashmir) వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. దీంతో భారత బలగాలు పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేశాయి. పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం (destroyed pakistan army posts) చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ ఎక్స్‌లో పోస్టు (indian army post video on x) చేసింది.
