ePaper
More
    HomeతెలంగాణOperation Sindoor | భారత్​ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లే : సీఎం రేవంత్​

    Operation Sindoor | భారత్​ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లే : సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఉగ్రవాదులు భారత్​ వైపు కన్నెత్తి చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) అన్నారు. పహల్గామ్​ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​కు (operation sindoor) సంఘీభావంగా గురువారం హైదరాబాద్​లో ర్యాలీ (rally on hyderabad) నిర్వహించారు. సెక్రటేరియట్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం (Secretariat to indira gandhi statue) వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ​రెడ్డి (CM revanth reddy), మంత్రులు (ministers), ఉన్నతాధికారులు, మాజీ ఆర్మీ అధికారులు (former army officers)పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జవాన్లకు స్ఫూర్తి ఇవ్వడానికే ఈ ర్యాలీ అన్నారు. వీర జవాన్లకు అండగా నిలబడేందుకు వచ్చిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

    Operation Sindoor | పాక్​ లేకుండా చేస్తాం..

    భారత్​పై ఎవరైనా దాడి చేస్తే వదలబోమని సైన్యం చాటి చెప్పిందన్నారు. భారత్​ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లేనని ఆయన అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు వీర సైనికులకు అండగా ఉంటారని సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) అన్నారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం ఇప్పించింది కూడా మహాత్మా గాంధీనే (Mahatma Gandhi gave independence to pakistan) అని సీఎం అన్నారు. ఆయన స్ఫూర్తితో భారత్​ శాంతి కాంక్షిస్తుంటే.. దానిని చేతకానితనంగా పాక్​ భావిస్తోందన్నారు. వారికి బుద్ధి చెప్పడానికి భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (india launch operation sindoor) చేపట్టిందన్నారు. భారత సైన్యం (indian army) తలచుకుంటే రాత్రికి రాత్రే పాకిస్తాన్​ గల్లంతు అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భారత్​పై దాడులు చేయాలని చూస్తే ప్రపంచ పటంలో నుంచి పాక్​ను మాయం చేస్తామన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...