అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | భారత్– పాక్ ఉద్రిక్తతల (india-pakistan tension) నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (defence minister rajnath singh) శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor), పాక్ దాడులు (pakistan attacks), ప్రతిదాడుల గురించి ఆయన సమీక్షించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో (new delhi, south black meeting) రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం సంసిద్ధత గురించి ఆయన ఆరా తీశారు.