HomeజాతీయంOperation Pimple | ఆపరేషన్ పింపుల్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Operation Pimple | ఆపరేషన్ పింపుల్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్​లోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ఆపరేషన్​ పింపుల్ చేపట్టి వారిని మట్టుబెట్టాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Pimple | జమ్మూ కశ్మీర్​లో భద్రతా బలగాలు ఆపరేషన్​ పింపుల్ చేపట్టాయి. పలువురు ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం మేరకు శుక్రవారం ఈ ఆపరేషన్​ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం మట్టు బెట్టింది.

జమ్మూ కాశ్మీర్‌ (Jammu Kashmir)లోని కుప్వారాలోని కేరాన్ సెక్టార్‌లో శనివారం భద్రతా దళాలు చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఉమ్మడి ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 7న ఆపరేషన్ పింపుల్ (Operation Pimple) ప్రారంభించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. చొరబాటు ప్రయత్నానికి సంబంధించి ఏజెన్సీల నుంచి వచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, కుప్వారాలోని కేరాన్ సెక్టార్‌లో ఉమ్మడి ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నాయి. అయితే ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. అనంతరం సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు (Army Officers) తెలిపారు.

Operation Pimple | ఉగ్ర కదలికలపై నిఘా

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఏజెన్సీలు, బలగాలు ఉగ్రవాదుల కదలికపై నిఘా పెంచాయి. ఆపరేషన్​ సిందూర్​తో పాక్​లోని ఉగ్ర స్థావరాలను భారత్​ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో టెర్రరిస్టులు మళ్లీ దాడులు చేయడానికి యత్నిస్తున్నారనే సమాచారం మేరకు బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్​ సంస్థలు (Intelligence Agencies) ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో చొరబట్లపై సైన్యం అప్రమత్తంగా ఉంటుంది. ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తే ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి వారిని మట్టు బెడుతోంది.

Must Read
Related News