HomeతెలంగాణAnil Kumar Eravathri | తక్షణమే ఆపరేషన్​ కగార్​ను నిలిపేయాలి

Anil Kumar Eravathri | తక్షణమే ఆపరేషన్​ కగార్​ను నిలిపేయాలి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Anil Kumar Eravathri | కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్​ కగార్​ను నిలిపేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ డిమాండ్​ చేశారు. హైదరాబాద్ (Hyderabad)​లోని సీపీఐ కార్యాలయంలో(CPI Office) శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీది మొదటి నుంచి గాంధేయవాదమేనన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్​ హయాంలో హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. మావోయిస్టుల చేతుల్లో చాలామంది కాంగ్రెస్​ నేతలు మృతి చెందారని.. అయినప్పటికీ కాంగ్రెస్​ పార్టీ ఎలాంటి మారణహోమానికి దిగలేదని స్పష్టం చేశారు.

Anil Kumar Eravathri | నంబాల కేశవరావు పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదు

బడుగు బలహీనవర్గాల సామాజిక న్యాయం కోసం సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) తన జీవితాంతం పోరాడారని ఈరవత్రి అనిల్​ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని కాల్చి చంపి, మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బీజేపీ ప్రభుత్వం(BJP government) దారుణంగా వ్యవహరించిందన్నారు. మావోయిస్టులు పేదల పక్షాన పోరాటం చేశారే తప్ప దేశాన్ని విచ్ఛినం చేసేందుకు కాదని స్పష్టం చేశారు.