ePaper
More
    HomeజాతీయంOperation Kagar | కర్రెగుట్టల్లో ముగిసిన ఆపరేషన్ కగార్

    Operation Kagar | కర్రెగుట్టల్లో ముగిసిన ఆపరేషన్ కగార్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Kagar | తెలంగాణ – ఛత్తీస్​గఢ్​​ సరిహద్దులో Telangana-Chhattisgarh border ములుగు జిల్లా వెంకటాపూర్​ సమీపంలో గల కర్రెగుట్టల్లో karreguttalu ఆపరేషన్​ కగార్​ operation kagar ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కర్రెగుట్టల్లో దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు వేల సంఖ్యల్లో బలగాలు చుట్టు ముట్టాయి. 21 రోజుల పాటు సాగిన కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.

    Operation Kagar | భద్రతా బలగాల విజయం

    క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్న కర్రెగుట్టల్లో సవాళ్ల నడుమ భద్రతా బలగాలు security forces ఆపరేషన్​ చేపట్టాయి. ఈ ఆపరేషన్​లో బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. కూంబింగ్​లో భాగంగా జరిగిన ఎన్​కౌంటర్లలో encounters 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు 18 మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. ఒక ల్యాండ్​మైన్​ పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఇందులో తెలంగాణలోని కామారెడ్డి kamareddy జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​ వడ్ల శ్రీధర్​ కూడా ఉన్నారు. మరోవైపు ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టులపై మొత్తం రూ.1.72 కోట్ల రివార్డ్ ఉంది.

    Operation Kagar | భారీగా ఆయుధాలు స్వాధీనం

    కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్​లో భద్రత బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 214 మావోయిస్టు డంప్​లను గుర్తించారు. 35 రైఫిల్స్, 450 ఐఈడీలు, డిటోనేటర్లు, ఇండెక్స్ వైర్ల బండిల్స్, బుల్లెట్లు, ఫ్యూజ్ వైర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల బంకర్లను ధ్వంసం చేశారు.

    Operation Kagar | చిక్కని ‘హిడ్మా’

    మావోయిస్టు కీలక నేత హిడ్మాతో hidma పాటు ఆయన దళ సభ్యులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వారి లక్ష్యంగానే ఆపరేషన్​ చేపట్టినట్లు సమాచారం. అయితే మోస్ట్​వాంటెండ్​ హిడ్మా మాత్రం బలగాలకు చిక్కలేదు. ఆపరేషన్​ ప్రారంభం కాగానే నక్సల్స్ naxals​ బంకర్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు బలగాలు గుర్తించాయి. పలు మావోయిస్టుల బంకర్లను జవాన్లు ధ్వంసం చేశారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమని, ఆపరేషన్​ కగార్ ఆపాలని మావోలు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మావోలు లేఖ విడుదల చేసిన రోజు కర్రెగుట్టల్లో ఆపరేషన్​ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...