HomeUncategorizedVice President Dhankhar | లాడెన్‌ను ముట్టుబెట్టిన‌ట్లుగానే.. ఆప‌రేష‌న్ సిందూర్

Vice President Dhankhar | లాడెన్‌ను ముట్టుబెట్టిన‌ట్లుగానే.. ఆప‌రేష‌న్ సిందూర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Dhankhar | భార‌త సైన్యం ఇటీవ‌ల చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ (operation sindoor) గ్లోబ‌ల్ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గదీప్ ధ‌న్‌ఖ‌డ్ (vice president jagdeep dhankhar) అన్నారు. గ‌తంలో ఉగ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్ (bin laden) అమెరికా హత‌మార్చిన ఘ‌ట‌న‌తో తాజా ఆప‌రేష‌న్ సిందూర్‌ను పోల్చారు. భార‌త్ మునుపెన్నడూ లేని రీతిలో పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి మ‌రీ ఉగ్ర‌మూక‌ల‌ను ఏరివేసింద‌న్నారు. 2011 మే 2న అమెరికా ద‌ళాలు కూడా ఇదే విధంగా పాక్‌లోకి (pakistan) చొచ్చుకెళ్లాయ‌ని లాడెన్ పేరును ప్ర‌స్తావించ‌కుండా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22పన‌ పహల్​గామ్​ ఉగ్రవాద దాడి (pahalgam terror attack) తర్వాత భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌ను, 9/11 దాడుల తర్వాత ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హత్యకు దారితీసిన అమెరికా మిషన్‌ను (america mission) ధన్‌ఖడ్​ పోల్చి చెప్పారు. రెండు ఆపరేషన్లు పాకిస్తాన్ భూభాగంలో “లోతుగా” విజయవంతంగా నిర్వహించబడ్డాయని పేర్కొన్నారు.

Vice President Dhankhar | భార‌త్ చేసి చూపింది..

లాడెన్ పేరును నేరుగా ప్రస్తావించకని ధ‌న్‌ఖ‌డ్‌.. మే 2, 2011వ తేదీన సెప్టెంబర్ 11 దాడులకు కారణమైన “గ్లోబల్ టెర్రరిస్ట్”తో అమెరికా దళాలు (america forces) “ఇదే” విధంగా “వ్యవహరించాయని” ధన్‌ఖడ్ గుర్తు చేశారు. ఇప్పుడు భార‌త్ కూడా అదే చేసి చూపింద‌ని, పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్ర‌వాదుల‌ను (terrorists) ఏరివేసింద‌న్నారు. “ప్ర‌పంచానికి తెలిసేలా చేసి చూపిది. శాంతియుత వాతావ‌ర‌ణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉగ్ర‌వాదుల్ని తుద‌ముట్టించ‌డం ద్వారా గ్లోబ‌ల్ బెంచ్‌మార్క్‌ను క్రియెట్ చేసింద‌ని” జగదీప్ అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్ శాంతిని కాపాడటమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కొత్త “గ్లోబల్ బెంచ్‌మార్క్”ను (globel bench mark) ఏర్పాటు చేసిందని అన్నారు.

Vice President Dhankhar | ఇదే అతి పెద్ద దాడి..

పాకిస్తాన్‌లోని (pakistan) తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన దాడులను ఇండియా ఇప్పటివరకు చేసిన అత్యంత భారీ సరిహద్దు దాడి అని ఆయన అభివర్ణించారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద గ్రూపుల బలమైన ప్రాంతాలపై అంతర్జాతీయ సరిహద్దులో లోతుగా క‌చ్చితమైన దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఉప‌రాష్ట్ర‌ప‌తి (vice president) అన్నారు. దాడులు చాలా క‌చ్చితంగా ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయ‌ని తెలిపారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల (mumbai terrorist attacks) తర్వాత పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి పహల్గామ్ ఉగ్రవాద దాడి (pahalgam terrorist attack) అని పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ (PM narendra modi) బీహార్ నుంచి ప్రపంచానికి స్ప‌ష్ట‌మైన సందేశం పంపారని ఆయన పేర్కొన్నారు. “అవి ఉత్త మాటలు కావు. ప్రపంచం ఇప్పుడు గ్రహించింది” అని ఆయన అన్నారు.

Vice President Dhankhar | వారికి మ‌ద్ద‌తివ్వొద్దు..

ట‌ర్కీ (turkey), అజార్‌బైజాన్‌ల‌పై బ‌హిష్క‌ర‌ణాస్త్రం కొన‌సాగుతున్న త‌రుణంలో ధ‌న్‌ఖ‌డ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ భద్రతలో (national security) ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం వంటి రంగాలలో ప్రతి పౌరుడికి పాత్ర ఉందని ఉప‌రాష్ట్ర‌ప‌తి (vice president) తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. భారత (india) ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న దేశాలకు మద్దతు ఇవ్వొద్ద‌ని ఆయ‌న సూచించారు. “మన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న దేశాలకు మనం అధికారం ఇవ్వగలమా? మనలో ప్రతి ఒక్కరూ ఆర్థిక జాతీయవాదం గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది” అని ధ‌న్‌ఖ‌డ్ (vice president jagdeep dhankhar) అన్నారు. “మనం ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, దేశమే ముందు అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించాలి. ఇదే మనస్తత్వాన్ని మనం మన పసిపిల్లలకు మొదటి రోజు నుంచే నేర్పించాలి” అని కోరారు.