HomeUncategorizedIran - Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు...

Iran – Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు మార్గం సుగమం ​

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran – Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్ 16న భారత్​ చేసిన అభ్యర్థనకు ఆ దేశం స్పందించింది. తమ గగనతలం మూసివేయబడినప్పటికీ, విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి అన్ని భూ సరిహద్దులు తెరిచి ఉన్నాయని ఇరాన్​ పేర్కొంది.

భారత్​ దౌత్య మిషన్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి (Iranian Foreign Minister) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దౌత్యవేత్తలు, పౌరులను సురక్షితంగా తరలించడానికి సహకారం అందించారు. “ప్రస్తుత పరిస్థితి, దేశంలోని విమానాశ్రయాల మూసివేత కారణంగా తమ దౌత్యవేత్తలు, జాతీయులను వారి వారి దేశాలకు పంపించాలనే అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని, భూ సరిహద్దులు తెరిచి ఉంచాం..” అని మంత్రి చెప్పుకొచ్చారు.

దేశం నుంచి నిష్క్రమించాలనుకునే వ్యక్తులందరి పేర్లు, పాస్‌పోర్ట్ నంబర్లు, వాహన వివరాలు, ప్రయాణ సమయాలు, కావలసిన సరిహద్దు క్రాసింగ్‌లను దాని జనరల్ ప్రొటోకాల్ విభాగాని(General Protocol Department)కి అందించాలని భారత్​ను టెహ్రాన్ కోరింది. ఈ సమాచారం దౌత్యవేత్తలు, ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లను సులభతరం చేసింది.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర క్షిపణుల దాడి కొనసాగుతోంది. దీంతో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌(Jammu – Kashmir)కు చెందిన 1,500 మందికి పైగా విద్యార్థులు సహా వేలాది భారతీయులు ఇరాన్​లోని వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు.

భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన కదలికలను నివారించాలని, ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని, స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రొటోకాల్​ను పాటించాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.

వారి X (ట్విట్టర్ Twitter) ఖాతాలో అందించిన Google ఫారమ్‌ను పూరించాలని, నవీకరణల కోసం టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాలని ఇండియన్​ ఎంబసీ కోరింది. “దయచేసి గుర్తుంచుకోండి, భయపడకుండా ఉండటం, తగిన జాగ్రత్త వహించడం, టెహ్రాన్‌(Tehran)లోని భారత రాయబార కార్యాలయంతో సంబంధాలు కొనసాగించడం ముఖ్యం” అని రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది.

Must Read
Related News