Open School
Open School | ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు చెల్లించాలి

అక్షరటుడే, ఇందూరు: Open School | తెలంగాణ ఓపెన్ స్కూల్ (Telangana Open School) సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు ఫీజు చెల్లించే తేదీలు ఖరారైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (DEO Ashok) తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి (SSC), ఇంటర్ (Inter)​ పరీక్షల ఫీజు ఈనెల 28 నుంచి ఆగస్టు 5వ తేదీ లోపు చెల్లించాలన్నారు.

అలాగే రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు10లోపు చెల్లించవచ్చని, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 11 నుంచి 15వ తేదీ లోపు, తత్కాల్ (Tatkal) రుసుముతో ఆగస్టు 16 నుంచి 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు టీఎస్ ఆన్​లైన్​, ఏపీ ఆన్​లైన్​, మీసేవ సెంటర్లో చెల్లించాలని పేర్కొన్నారు.