అక్షరటుడే, మెండోరా: Mendora | మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం (open house program) నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు.
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌హెచ్‌వో సుహాసిని విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధాల పనితీరు, స్టేషన్ రికార్డులు, నిర్వహణ, రిసెప్షన్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలు (CCTV cameras), తదితర అంశాలపై వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
అనంతరం ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ సందర్శన ద్వారా విద్యార్థులకు పోలీసుల రోజువారీ విధులు, భద్రతా చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై అవగాహన పెంపొందుతుందన్నారు. అలాగే డయల్ 100, షీ టీమ్, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలు, బందోబస్తు అంశాలపై వివరించారు.