ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYashoda Hospitals | కామారెడ్డిలో యశోద ఆస్పత్రి ఓపీ సేవలు

    Yashoda Hospitals | కామారెడ్డిలో యశోద ఆస్పత్రి ఓపీ సేవలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Yashoda Hospitals | యశోద ఆస్పత్రి ఓపీ సేవలను జిల్లా కేంద్రంలో అందుబాటులోకి తీసుకొచ్చామని యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్ బీజే రాజేష్ (BJ Rajesh, Neurosurgeon, Yashoda Hospital)​ తెలిపారు. గురువారం పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్​ను ప్రారంభించారు.

    అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డా. రాజేష్ మాట్లాడుతూ.. బ్రెయిన్, హార్ట్ ఆపరేషన్స్, లివర్ మార్పిడి లాంటి చికిత్సల్లో యశోధ ఉత్తమ స్థానంలో ఉందన్నారు. ఆపరేషన్ థియేటర్​లో ఎంట్రోపీ ఎమ్మారై (Entropy MRI) సమకూర్చిన ఏకైక ఆస్పత్రి యశోద అని పేర్కొన్నారు.

    కామారెడ్డికి చెందిన ప్రశాంతి గర్భిణిగా ఉన్న సమయంలో మెదడులో నరాలు దెబ్బతిని ఇబ్బందులు పడగా.. యశోదలో చికిత్స అందించామన్నారు. అలాంటి పేషెంట్లు ప్రతిసారి హైదరాబాద్​కు రావాలంటే.. ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కామారెడ్డిలో యశోద మెడికల్​ సెంటర్​ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రశాంతి, జనరల్ మేనేజర్ దేవేందర్, మేనేజర్ అనిల్ కుమార్, పీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...