అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lionel Messi | లియోనెల్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ (Friendly Match) ఉప్పల్ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాచ్‌కు టికెట్లు ఉన్నవాళ్లే రావాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు కోరారు.
ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరగనుంది. మెస్సీ నగరానికి రానుండటంతో ప్రజలు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) కీలక సూచనలు చేశారు. టికెట్లు ఉన్నవాళ్లే స్టేడియం దగ్గరకు రావాలన్నారు. మెస్సీ గోట్ ఇండియా టూర్‌కు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, బ్యాటరీలు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లకు స్టేడియంలో తీసుకు రావొద్దన్నారు.
Lionel Messi | చూసే అవకాశం ఉండదు
ఈ మ్యాచ్‌కు దేశవిదేశాల నుంచి ప్రముఖులు వస్తారని సీపీ తెలిపారు. ఈ సమయంలో మనం ఎంత క్రమశిక్షణగా ఉన్నామో చూపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి టికెట్ల విక్రయం ఉండదని స్పష్టం చేశారు. టికెట్లు లేని వారు స్టేడియానికి రావొద్దని ఆయన కోరారు. మెస్సీని చూసే అవకాశం కూడా ఉండదన్నారు. హై సెక్యూరిటీలో ఆయన లోనికి వస్తారని చెప్పారు. మెస్సీ వచ్చే దారిలో ఎవరిని అనుమతించమని స్పష్టం చేశారు. దీంతో అతడిని చూసే అవకాశం కూడా ఉండొదన్నారు. ఈ ఈవెంట్ మన నగరానికి గర్వ కారణమన్నారు. దీనికి విజయవంతం చేయాలని కోరారు.
Lionel Messi | ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ
ఫుట్‌బాల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) రాచకొండ పోలీసులతో కలిసి పరిశీలించారు. మ్యాచ్‌కు హాజరయ్యే ప్రేక్షకులు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రేక్షకులకు మార్గదర్శకాలు, భద్రతా నియమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. స్టేడియంలో 39 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉందని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అన్నారు.