అక్షరటుడే, ఆర్మూర్ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (In-charge Meenakshi Natarajan) అన్నారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామ శివారులోని యమునా గార్డెన్స్‌లో ఆదివారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల (Nizamabad and Kamareddy districts) ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కార్పొరేట్ ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.