HomeతెలంగాణDCC Nizamabad | పని చేసిన వారికే కాంగ్రెస్‌ పార్టీలో గుర్తింపు

DCC Nizamabad | పని చేసిన వారికే కాంగ్రెస్‌ పార్టీలో గుర్తింపు

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: DCC Nizamabad | కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వ‌స్తాయ‌ని పీసీసీ నేత‌, జిల్లా పరిశీలకులు తిరుపతి(PCC leader, district observers Tirupati) అన్నారు. నగరంలోని కంఠేశ్వర్‌లో (Kanteshwar) బుధవారం సంస్థాగ‌త ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎనిమిది డివిజన్ల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో, నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలో పనిచేసిన వారికి గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు.

క‌ష్ట‌ప‌డ్డ‌వారికి డివిజ‌న్‌ల‌లో పార్టీ ప‌ద‌వులు దక్కుతాయ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హందాన్‌ (Taher bin Hamdan), కేశ వేణు (Kesha Venu), నరాల రత్నాకర్ (Narala Ratnakar), భక్తవత్సలం నాయుడు, బొబ్బిలి రామకృష్ణ విక్కీ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.