Homeజిల్లాలుకామారెడ్డిFisheries Cooperative Society | మత్స్య సహకార సంఘం సభ్యులకే చేపల వేట హక్కు

Fisheries Cooperative Society | మత్స్య సహకార సంఘం సభ్యులకే చేపల వేట హక్కు

చెరువుల్లో మత్స్య సహకారం సంఘం సభ్యులు మాత్రమే చేపల వేటకు అర్హులని ఫిషరీస్​ డెవలప్​మెంట్​ అధికారి డోలిసింగ్​ పేర్కొన్నారు. ఇతరులు చేపలు పట్టే అధికారం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : Fisheries Cooperative Society | మత్స్య సహకార సంఘం సభ్యులకే చెరువుల్లో చేపలు పట్టే హక్కు ఉందని ఫిషరీస్ డెవలప్​మెంట్​ అధికారి (Fisheries Development Officer) డోలిసింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

చెరువుల్లో చేపల వేట హక్కులను దళారులకు లేదా ఇతరులకు అప్పగించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఘటనలు గుర్తించిన వెంటనే సంబంధిత సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్య సహకార సంఘాల (Fisheries Cooperative Society) ద్వారా మాత్రమే చేపల వేట కొనసాగించాలని, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు కూడా సంఘ సభ్యులకే అందుతాయని తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్యకారులు (Fishermens) నేరుగా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాలనుకుంటే నిబంధనలు పాటించాలని సూచించారు.