ePaper
More
    HomeతెలంగాణNizamabad collector | ప్రభుత్వం గుర్తించిన వంగడాలనే సాగుచేయాలి

    Nizamabad collector | ప్రభుత్వం గుర్తించిన వంగడాలనే సాగుచేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Rajiv Gandhi Hanumanthu | ఖరీఫ్​లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 23 రకాల వరి వంగడాలను మాత్రమే రైతులు వినియోగించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్​లో జిల్లావ్యాప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటల సాగు చేస్తారని అంచనా ఉందన్నారు. ఇందులో ఒక రకం వరిని 4.37 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందన్నారు. రైతులు ప్రభుత్వం గుర్తించని వంగాలను సాగు చేస్తుండడంతో ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

    Nizamabad collector | లైసెన్స్​డ్​ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు..

    భూభారతి అమల్లో భాగంగా లైసెన్స్​డ్​ సర్వేయర్ల (Licensed Surveyors) శిక్షణ కోసం అర్హత కలిగిన వారు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్​ సూచించారు. ఇప్పటికే ప్రైవేటు సర్వేయర్లుగా (Private surveyors) పనిచేస్తున్న వారు ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందేందుకు వీలుగా సీసీఎల్ఏ కమిషనర్ (CCLA Commissioner) కార్యాలయానికి దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

    Nizamabad collector | ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అవగాహన

    వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) పనులు వేగవంతంగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్​ ఆదేశించారు. జూన్ మొదటి, రెండో వారంలో చేపట్టే వనమహోత్సవం కార్యక్రమానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...