HomeతెలంగాణTraffic Police | మందుబాబులకు చుక్కలే.. ఇక పగలు కూడా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు

Traffic Police | మందుబాబులకు చుక్కలే.. ఇక పగలు కూడా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Police | రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వందలాది మంది మృతి చెందుతున్నారు. చాలా రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి వాహనాలు నడపమే కారణం. ఈ క్రమంలో హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నిత్యం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపడుతున్న పోలీసులు.. వీకెండ్​లో స్పెషల్​ డ్రైవ్​ చేపట్టి మరి మందుబాబుల ఆట కట్టిస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం తర్వాతే డ్రంకన్​ డ్రైవ్​ టెస్ట్(Drunk Driving Test)​లు చేస్తున్నారు. ఇక నుంచి పగలు కూడా చేయాలని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Traffic Police | మద్యం మత్తులో..

నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలు నడపాలి. కానీ కొంతమంది మద్యం మత్తులో ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటి వారితో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు (Hyderabad Traffic Police) మందుబాబుల ఆట కట్టించడానికి పగటి పూట కూడా డ్రంకన్​ డ్రైవ్​ టెస్టులు చేపట్టనున్నారు. ఇక నుంచి ఆకస్మికంగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు.

Traffic Police | పాఠశాలల బస్సు డ్రైవర్లు సైతం..

డ్రంక్ అండ్​ డ్రైవ్ తనిఖీలు వీకెండ్స్, నైట్ మాత్రమే చేస్తారనే భావనలో ప్రజలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్​ సమస్య నేపథ్యంలో రాత్రిపూట మాత్రమే తనిఖీలు చేపట్టామన్నారు. అయితే కొందరు పగటి పూట కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు తేలడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్​ పాఠశాలల బస్సు డ్రైవర్లు (Private School Bus Drivers) మద్యం తాగి బస్సు నడుపుతూ దొరికారన్నారు. ఇలా 35 ప్రైవేట్​ బస్సు డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు. దీంతో పగటి పూట కూడా తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.

Traffic Police | జైలుశిక్ష వేస్తున్న మారని తీరు

ప్రస్తుతం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెడుతున్నారు. వారి మద్యం మోతాదు, గతంలో దొరికారా అని ఆరా తీసి న్యాయమూర్తులు జరిమానాలు, జైలుశిక్ష విధిస్తున్నారు. అయితే జైలుశిక్ష విధిస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.