అక్షరటుడే, కామారెడ్డి: online gaming | ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డ యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీవ్ర శోకం మిగిల్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానిక సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి గోదావరికి శ్రీనాథ్, శ్రీకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనాథ్‌కు వివాహం అయింది. శ్రీకర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
online gaming | ఆన్లైన్లో గేమింగ్‌తో అప్పులు..
కాగా, శ్రీకర్ ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో విపరీతంగా అప్పులు చేశాడు. అయితే రుణదాతల ఒత్తిడి భరించలేక ఉన్న ఇల్లు అమ్ముకుని కొన్ని అప్పులు తీర్చాడు. మిగతావి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
గురువారం (జనవరి 01) తల్లి గోదావరి కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒక్కడే ఉన్న శ్రీకర్ బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.