HomeతెలంగాణOnline betting | ఆన్​లైన్​ బెట్టింగ్​ రాకెట్​ గుట్టురట్టు.. 10 వెబ్​సైట్స్ మూసివేత.. ప్రమోట్ చేస్తున్న...

Online betting | ఆన్​లైన్​ బెట్టింగ్​ రాకెట్​ గుట్టురట్టు.. 10 వెబ్​సైట్స్ మూసివేత.. ప్రమోట్ చేస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Online betting : బెట్టింగ్ యాప్​లను (betting apps) ప్రమోట్ చేస్తున్న ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. కమీషన్లు ఆర్జిస్తున్న ఏడుగురు ఇన్​ఫ్లుయెన్సర్​లలో నలుగురిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు (Cyberabad Crime Police) అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్, ఇన్​స్టాలో నిందితులు బెట్టింగ్ యాప్​లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో ఒక్కొక్కరికి 10 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ వల్ల ఓ యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ముఠా విషయం వెలుగుచూసింది. కమీషన్​తో ఒక్కొక్కరు రూ.50 లక్షల వరకు సంపాదించినట్లు నిర్ధారణ అయింది. ఇన్​ఫ్లుయెన్సరులు ​(influencers) 2019 నుంచి బెట్టింగ్ యాప్​లను ప్రమోట్ చేస్తున్నారు. 10 విదేశీ వెబ్​సైట్​లను నిందితులు ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు డీసీసీ సాయిశ్రీ తెలిపారు.

Online betting | ఫిర్యాదు చేయడంతో..

మియాపూర్ (Miyapur) నివాసి జూన్ 13న ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్​ ప్రమోటర్స్ ముఠా గుట్టురట్టు చేశారు. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తనను, తన స్నేహితుడిని వరుసగా రూ.50 లక్షలు, రూ.60 లక్షలు మోసం చేశారని, “టాస్ ఫిక్స్ హామీ ఇచ్చారని” అని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితులు టెలిగ్రామ్ (Telegram account) ఖాతాలను సృష్టించుకుని, క్రికెట్ మ్యాచ్​లపై ప్రత్యేకమైన ఇన్సైడర్ చిట్కాలు అందిస్తూ ఫిక్స్డ్ మ్యాచ్​లను యాక్సెస్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. బాధితులు మ్యాచ్​లపై పందెం కాస్తే.. UPI ద్వారా మ్యూల్ ఖాతాలకు డబ్బును పంపించమని ఒత్తిడి చేసేవారని తెలిపారు. నకిలీ ఆధార్​, పాన్ కార్డును ఉపయోగించి ఈ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు వివరించారు.

Must Read
Related News