అక్షరటుడే, మెండోరా : Sri Ramsagar flood | శ్రీరామ్ సాగర్‌కు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఉద్ధృతంగా వరద నీరు వస్తోంది.
ప్రాజెక్టులో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రాజెక్టు 23 వరద గేట్లు ఎత్తి గోదావరి నది లోకి నీరు వదులునున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.
ప్రాజెక్టు దిగువన గోదావరి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల కాపరులు, గొర్ల కాపారులు, చేపలు పట్టేవారు, రైతులు, ప్రజలు నది దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Sri Ramsagar flood | 76.104 టీఎంసీలకు చేరిన నీటిమట్టం…
తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ నీరు వచ్చి చేరుతోంది.
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో భారీగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి 1 లక్ష 15 వేల 750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు ) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 76.104 టీఎంసీ(1090.00 అడుగులు) లకు చేరింది.
Sri Ramsagar flood | కాలువల ద్వారా నీటి విడుదల…
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో 23 వరద గేట్లు ఎత్తి 1 లక్ష 26 వేల 897 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3500 క్యూసెక్యులు cusecs విడుదల చేస్తున్నారు.
వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4500 క్యూసెక్యులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.
666 క్యూసెక్కులు ఆవిరి అవుతోంది. మొత్తం 1 లక్ష 26 వేల 897 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సరస్వతి, లక్ష్మి కాలువతో పాటు అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు నీటి విడుదలను నిలిపి వేశారు.