ePaper
More
    HomeజాతీయంIsrael - Iran | కొనసాగుతున్న ఇజ్రాయెల్​ దాడులు.. బంకర్​లో దాక్కున్న ఖమేనీ!

    Israel – Iran | కొనసాగుతున్న ఇజ్రాయెల్​ దాడులు.. బంకర్​లో దాక్కున్న ఖమేనీ!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Israel – Iran | ఇజ్రాయెల్​– ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్​ రైజింగ్​ లయన్(Operation Rising Lion)​ పేరిట ఇరాన్​లోని అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులు చేపడుతోంది. ఈ క్రమంలో ఇరాన్​ కూడా డ్రోన్లు, క్షిపణులతో టెల్​ అవీవ్​పై విరుచుకు పడుతోంది.

    రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడంతో పశ్చిమాసియాలో ఆందోళన నెలకొంది. ఇరాన్​ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్​ ఐరన్​ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటుంది. అయినా కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్(Israel)​లోని పలు ప్రాంతాల్లో పడ్డాయి. ఈ క్రమంలో పలువురు ఇజ్రాయెల్​ పౌరులు మృతి చెందారు. దీంతో టెల్​అవీవ్(Tel Aviv)​ దాడులను మరింత తీవ్రం చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అండర్​ గ్రౌండ్​లో ఆయన కుటుంబంతో కలిసి దాక్కునట్లు తెలుస్తోంది.

    Israel – Iran | ఖమేనీ లక్ష్యంగా దాడులు

    ఇజ్రాయెల్​ ఆపరేషన్​ రైజింగ్​ లయన పేరిట తొలిరోజు కీలక అణుస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలపై దాడి చేసి హతమార్చింది. సుమారు 200 యుద్ధ విమానాలతో టెల్​ అవీవ్​ దాడులకు పాల్పడటం గమనార్హం. అంతకు ముందే ఇజ్రాయెల్ నిఘా సంస్థ(Israel intelligence agency) ఇరాన్​లోని గగనతల రక్షణ వ్యవస్థలను, రాడార్లను కోవర్టు ఆపరేషన్​ ద్వారా నిర్వీర్యం చేశాయి. దీంతో ఇజ్రాయెల్​ దాడులను ఇరాన్​ అడ్డుకోలేకపోయింది. అయితే ఇరాన్​ సుప్రీం కమాండర్​ ఖమేనీ(Supreme Commander Khamenei) ఇంటి సమీపంలో సైతం ఐడీఎఫ్​ దాడులకు పాల్పడటం గమనార్హం. అణు ఒప్పందం చేసుకోవాలని హెచ్చరికంగా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...