అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 14,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువన సింగూరు (Singuru), పోచారం (PPocharam) ప్రాజెక్ట్‌ల నుంచి నిజాంసాగర్‌కు వరద వస్తోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కులు మంజీర (Manjeera)లోకి వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.7 (17.44 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
Nizam Sagar | పోచారంలోకి..
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌కు 3,230 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అంతేమొత్తంలో నీరు ప్రాజెక్ట్‌పై నుంచి పొంగి, మంజీరలో కలుస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు కాగా.. నిండుకుండలా కళకళలాడుతూ అలుగు పారుతోంది. ప్రాజెక్ట్ అందాలను చూడటానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం కావడంతో రెండు రోజుల పాటు డ్యామ్‌కు పర్యాటకులు భారీగా రానున్నారు.
Nizam Sagar | ఏడుపాయల ఆలయం మూసివేత
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయాన్ని (Edupayala Temple) అధికారులు మరోసారి మూసి వేశారు. సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఆలయం ముందునుంచి మంజీర ఉధృతంగా పారింది. దీంతో ఇటీవల 27 రోజుల పాటు ఆలయం మూసి ఉంచారు. అయితే వరద తగ్గడంతో గురువారం అధికారులు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అయితే మళ్లీ వరద పెరగడంతో ఆలయాన్ని శనివారం మూసి వేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.