అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)లోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 1,11,270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వరద తగ్గడంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం 37 గేట్లను ఎత్తిన అధికారులు సోమవారం 26 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1090.90 (80.05 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.
ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా 1,01,480 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | నిజాంసాగర్‌లోకి..
అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar Project)లోకి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 16,507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వరద గేట్ల ద్వారా 10,987 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | పొంగి పొర్లుతున్న పోచారం
స్థానికంగా కురుస్తున్న వర్షాలతో నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్(Pocharam Project)లోకి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యామ్‌లోకి ప్రస్తుతం 2,511 క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన నీరు వచ్చినట్లు ప్రాజెక్ట్ పైనుంచి పొంగి పొర్లుతోంది.