అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదైంది. అయితే నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులు ఉండడంపై రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి (Election Officer Sudarshan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని నాన్‌లోకల్స్‌పై కేసులు నమోదు చేయాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు. మాక్ పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. 9 చోట్ల ఈవీఎంలను మార్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నాన్ లోకల్స్‌పై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఉండడానికి వీలు లేదు. అయితే కొన్ని పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్టవేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద హడావుడి చేశారు. దీంతో సీఈవో చర్యలు చేపట్టారు.
Jubilee Hills | మంచి స్పందన
ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ఇప్పుడు కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. యువత బయటకు రావడం లేదన్నది అవాస్తవం అన్నారు. ఓటర్ల నుంచి తమకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.
Jubilee Hills | వారికి మద్దతుగా పోలీసులు
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు మద్దతు ఇస్తున్నారన్నారు. తాము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే వీడియోలు తీస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Jubilee Hills | ఓటు వేయాలి
ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి కోరారు. సోమవారం రాత్రి బీజేపీ యువ మోర్చా నేతలపై కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) దాడి చేశారన్నారు. అన్నీ ఆలోచించి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.
