అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Oneplus 13s | చీప్ అండ్ బెస్ట్ ఫోన్స్‌లో వన్ ప్లస్ ఫోన్ one plus ఒకటిగా చెప్పవచ్చు. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ స్మార్ట్ ఫోన్ (smart phone) కొనాలని అనుకుంటే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ సిరీస్‌లో (one plus company new phone series) భాగంగా “వన్‌ప్లస్ 13s”ను (oneplus 13s) త్వరలోనే భారత మార్కెట్‌లో (indian markets) విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీని అధికారిక లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, లీకైన సమాచారం ఆధారంగా ఈ ఫోన్ అభిమానులను ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్స్‌తో వస్తుందట. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను (new phone frist look) ఇప్పటికే షేర్ చేసింది.
Oneplus 13s | గుడ్ న్యూస్..
దీన్ని బట్టి చూస్తే, OnePlus 13s డిజైన్ చాలా స్లీక్‌గా, చేతిలో ఇమిడిపోయేలా కాంపాక్ట్‌గా.. అదేవిధంగా ప్రీమియం ఫినిష్ తో అందంగా కనిపించనుంది. ఫోన్ వెనుక భాగంలో నిలువుగా అమర్చిన (వర్టికల్) డ్యూయల్ కెమెరా సెటప్‌తో (dual camera setup) పాటు ఫ్లాష్ ఉంటుంది. ముందు భాగంలో, స్క్రీన్ పైభాగంలో మధ్యలో పంచ్ హోల్ కెమెరా కట్‌ఔట్ అందించనున్నారు. మొత్తం మీద, డిజైన్ పరంగా వన్‌ప్లస్ 13s యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. లీకైన సమాచారం ప్రకారం డిస్‌ప్లే: 6.32 అంగుళాల పరిమాణంలో, అధిక రిజల్యూషన్ (1.5K) క్రిస్ప్‌గా ఉండే OLED డిస్‌ప్లే ఉంటుంది.
- రిఫ్రెష్ రేట్: స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్‌రేట్ సపోర్ట్.
- ప్రాసెసర్: కొత్తగా వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్. ర్యామ్,
- స్టోరేజ్: మల్టీటాస్కింగ్, డేటా స్టోరేజ్ కోసం 12GB RAM వరకు, 512GB ఇంటర్నల్ స్టోరేజ్.
- బ్యాటరీ: ఎక్కువసేపు పనిచేయడానికి 6,260mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ.
- ఛార్జింగ్: వేగవంతమైన ఛార్జింగ్ కోసం 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
కెమెరా సెటప్: బ్యాక్‌సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ – అధిక రిజల్యూషన్‌తో 50MP మెయిన్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నట్లు సమాచారం. లీకుల ప్రకారం.. ఈ కొత్త డివైస్ ఈ నెల చివర్లో భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా రూ.46,000 ధరతో మార్కెట్‌లోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.