అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tenth results | పదో తరగతిలో ఒకే విద్యార్థి.. ఏడుగురు ఉపాధ్యాయుల బోధన.. తీరా ఫలితం చూస్తే గుండు సున్నా. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనితాల్ nainithal district uttharakhand జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీరును ప్రశ్నిస్తోంది.
హల్ద్వానీలోని పాఠశాలలో పదో తరగతిలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అతడికి బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం.. ఇలా అన్ని సబ్జెక్టులకు టీచర్లను విద్యాశాఖ నియమించింది. వారికి ప్రతినెలా రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తోంది. అయినా చివరికి ఆ విద్యార్థి ఫెయిల్ కావడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Tenth results | విద్యాశాఖ స్పందన
ఏడుగురు టీచర్లు ఉన్నా.. బడిలో ఉన్న ఒకే ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కావడంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. బడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. విద్యార్థితో మాట్లాడామన్నారు. బాలుడి మానసిక, శారీరక అభివృద్ధి నెమ్మదిగా ఉందని.. అతడి తండ్రి అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. కాగా, ఉపాధ్యాయులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారి తెలిపారు.