Homeజిల్లాలునిజామాబాద్​Kotagiri | ప్రతిరోజు దైవ నామస్మరణ చేయాలి

Kotagiri | ప్రతిరోజు దైవ నామస్మరణ చేయాలి

ప్రతిరోజు దైవ నామస్మరణ చేయాలని మధుసూదనానంద సరస్వతి స్వామి తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ వార్షికోత్సవాలకు హాజరయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Kotagiri | ప్రతిరోజు దైవ నామస్మరణ చేస్తూ ఉంటే మనసుకు ప్రశాంతత లభిస్తుందని మధుసూదనానంద సరస్వతి స్వామి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ సాయి అయ్యప్ప దేవాలయంలో (Sri Sai Ayyappa Temple) మంగళవారం మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఉదయం దేవతమూర్తులకు కుంభాభిషేకం, పూర్ణాహుతి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద్ వితరణ చేశారు. అనంతరం పరమహంస పరివ్రాజకచార్య మధుసూదనానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మధుసూదనానంద స్వామి (Madhusudhanananda Swami) ఆధ్వర్యంలో భక్తులకు ప్రవచనాలు వినిపించారు. కళ్లు తెరిచినప్పటి నుంచి కళ్లు మూసే అంతవరకు 33 కోట్ల మంది దేవతలలో ఏదో ఒక దేవత నామస్మరణ చేస్తూ ఉండాలని ఆయన పేర్కొన్నారు. వంట చేసినా.. వ్యవసాయం చేసినా.. ఎక్కడికి వెళ్లినా దైవ నామస్మరణ చేస్తూ ఉండాలని స్వామిజీ తెలిపారు.

Kotagiri | పోచారం ప్రత్యేక పూజలు

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj) హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. అన్నదానం.. అన్నిటికన్నా గొప్పదానం అని అన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, విఠల్ రావు గుప్తా, పండితులు, బ్రహ్మశ్రీ నాగనాథ్ శాస్త్రి, దోసపాటి రాజేశ్వర్ జోషి, ఆలయా అర్చకులు కుందన్ పాండే, నీలేష్ పాండే, భక్తులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.