4
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. రాంనగర్ గ్రామానికి చెందిన పున్నమొల్ల రాజేశ్ గౌడ్‌పై నెహ్రునగర్‌కు చెందిన షేక్ హైమద్ 2020 అక్టోబర్ 12న సాయంత్రం కల్లుబట్టీలో సీసాతో హత్యాయత్నం చేశాడు.
బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడు హైమద్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. కేసు విచారించిన డిస్ట్రిక్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి సాయిసుధా (Judge Sai Sudha) నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అలాగే జరిమానా విధించారు.