అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మద్యం తాగి ఆటో నడిపిన కేసులో ఒకరికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుంచారు.
ఈ క్రమంలో సీతారాంనగర్కు చెందిన కిరణ్ మద్యం తాగి ఆటో నడుపుతున్నట్లుగా గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట అతడిని హాజరుపర్చగా విచారించిన న్యాయమూర్తి ఏడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10వేల జరిమానాతో పాటు.. జైలుశిక్ష విధించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.