అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk and Drive | మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్(SI Gangadhar) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5వ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. నాగారం ప్రాంతానికి చెందిన సాయులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారని ఎస్సై గంగాధర్ తెలిపారు.