అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. 16న 5వ టౌన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా మెదక్జిల్లాకు చెందిన రాజు మద్యం తాగి వాహనం నడిపిస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారించిన నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజుకు నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
