అక్షరటుడే, ధర్పల్లి : Drunk Drive | మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి నిజామాబాద్ (Nizamabad Court) న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ధర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ (Drunk Drive) తనిఖీలు చేస్తుండగా.. సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ మద్యం సేవించి బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు.
దీంతో పోలీసులు అతడికి కౌన్సెలింగ్ నిర్వహించి శుక్రవారం నిజామాబాద్‌లో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఏడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ధర్పల్లి పోలీసులు (Dharpalli Police) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధిస్తారని.. జైలుశిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
