అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | కాజ్‌వేపై వరదను అంచనా వేయకుండా దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ (Nizamsagar SI Sivakumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ అచ్చంపేటలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగమడుగు కాజ్‌వేను (Nagamadugu causeway) దాటేందుకు ప్రయత్నించాడు.
వరద ఉధృతంగా ఉండగా గమనించకుండా ఆయన కాజ్‌వేను దాటేందుకు ప్రయత్నించి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ప్రవీణ్‌కు భార్య సునీత, పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గల్లంతైన చాకలి ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.