Homeజిల్లాలునిజామాబాద్​Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై రామకృష్ణ(SI Ramakrishna) తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలంలోని మైలారం(Mylaram) శివారులో పాయిలకుంట చెరువు కట్టపై గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని చెప్పారు. అనంతరం గ్రామంలో సీసీ ఫుటేజ్​ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు మధ్యలో యువకుడిని తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​ మార్చురీకి తరలించినట్లు తెలిపారు.