Homeజిల్లాలుకామారెడ్డిHeavy Rains | వర్షాలకు ఒకరి మృతి.. వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడిన సిబ్బంది

Heavy Rains | వర్షాలకు ఒకరి మృతి.. వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడిన సిబ్బంది

- Advertisement -

అక్షరటుడే, నెట్​వర్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో వర్షాలతో ఒకరు మృతి చెందారు. రాజంపేట మండల కేంద్రంలో రికార్డు స్థాయిలో 423మి. మీ. వర్షపాతం నమోదు అయింది. దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో నీటి ప్రవాహానికి గోడ కూలి రాజంపేట మండలం గుండారం పల్లె దవఖానా డాక్టర్ వినయ్ కుమార్ మృతి చెందాడు.

ప్రహరీ కూలి మృతి చెందిన డాక్టర్​ వినయ్​ కుమార్​

Heavy Rains | ఐదుగురిని కాపాడిన సిబ్బంది

బొగ్గుగుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఎనిమిది బీహారీ కార్మికుల్లో ఐదుగురిని ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరో ముగ్గురిని రక్షించడానికి యత్నిస్తున్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కల్యాణి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు కాపాడాయి.

కల్యాణి వద్ద వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న సిబ్బంది
Must Read
Related News