అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కిందపడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన బిచ్కుంద శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై మోహన్ రెడ్డి (SI Mohan Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మంగలి సునీల్ తన భార్య జ్యోతితో కలిసి పెద్దతడుగూరు నుంచి శుక్రవారం బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బిచ్కుంద శివారులోని పెద్దమైసమ్మ గుడి వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి భార్యాభర్తలు ఇరువురు కిందపడ్డారు. భార్య జ్యోతికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
