ePaper
More
    Homeక్రైంHyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    Hyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. మటన్​ (Mutton) తిని అస్వస్థతకు గురై ఒక్కరు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చింతల్​కుంటలో చోటు చేసుకుంది.

    చింతల్​కుంట ఆర్టీసీ కాలనీలో శ్రీనివాస్​ యాదవ్​ (46) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తున్నారు. కాగా ఆదివారం బోనాల (Bonalu Festival) సందర్భంగా శ్రీనివాస్​ మటన్​, బోటీ, చికెన్​ తీసుకొచ్చాడు. పండుగ రోజు తిన్న తర్వాత మిగిలిన కర్రీలను ఫ్రిజ్​లో పెట్టారు. సోమవారం వాటిని వేడి చేసుకొని తిన్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ కావడంతో కుటుంబంలోని 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారు ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో జాయిన్​ అయ్యారు. అయితే పరిస్థితి విషమించి శ్రీనివాస్​ యాదవ్​ మంగళవారం మృతి చెందారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ఆయుధం

    అక్షరటుడే, కామారెడ్డి: Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ రాజేష్...

    Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగింది. అయితే...

    Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్...