Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

Yellareddy | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

Yellareddy | చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | చేపల వేటకు వెళ్లిన జాలరి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్​వాటర్ (Nizam Sagar)​ చోటు చేసుకుంది.

మల్కాపూర్ గ్రామానికి చెందిన కొండ సంగయ్య (52) ఆదివారం చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా.. ఆయన వాడే తెప్ప నీటిలో తేలియాడుతూ కనిపించింది. దీంతో నీటిలో గాలించగా.. ఆయన మృతదేహం లభ్యం అయింది. తెప్ప మీద నుంచి నీటిలో పడి, కాళ్లకు వల చుట్టుకోవడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సంగయ్య భార్య సాయవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు.