అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి పోలీస్స్టేషన్ (Indalwai Police Station) పరిధిలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన కిషన్(40) మృగశిర కార్తె కోసం చేపలు పట్టేందుకు సమీపంలోని కుంటకు వెళ్లాడు. అయితే కాళ్లకు వల చిక్కుకుని నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య అపర్ణ ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
