అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిర్నపల్లి (Sirnapalli) లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్నపల్లి గ్రామానికి చెందిన మేదరి గంగబాబు కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్ (Hyderabad)లో నివసిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా శుక్రవారం స్వగ్రామానికి వచ్చిన గంగబాబు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ (SI Sandeep) తెలిపారు.
