అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : China Manja | చైనామాంజా విక్రయిస్తున్న వారిపై పోలీస్‌శాఖ (Police Department) నిఘా పెట్టింది. ఈ మేరకు చైనామంజా విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
China Manja | రెండో టౌన్ పరిధిలో..
రెండో టౌన్ ఎస్‌హెచ్‌వో యాసిర్ అరాఫత్ (2 Town SHO Yasir Arafat) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు గురువారం నగరంలోని నెహ్రూ పార్క్ ప్రాంతంలో చైనామాంజా విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. రెండో టౌన్ ఎస్సై, తన సిబ్బందితో కలిసి హెడ్ పోస్టాఫీస్ (Head Post Office) వద్ద తనిఖీలు చేపట్టారు. పతంగుల దుకాణం యజమాని దారుగల్లికి చెందిన మహమ్మద్ రహీకుద్దీన్ మహమ్మద్ ప్రభుత్వం నిషేధించిన చైనామాంజాను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.