HomeసినిమాNagarjuna | మా కుటుంబంలో ఒకరు డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యారు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు

Nagarjuna | మా కుటుంబంలో ఒకరు డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యారు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు

తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని సినీ హీరో నాగార్జున తెలిపారు. ఆరు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా.. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పైరసీ సైట్లను ఓపెన్​ చేస్తే ప్రజల వ్యక్తిగత డేటా సైబర్​ నేరగాళ్ల చేతికి చేరే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna | డిజిటల్​ అరెస్ట్ (Digital Arrest) పేరిట సైబర్​ నేరగాళ్లు ఎంతో మందిని మోసం చేస్తున్నారు. తమ కుటుంబంలో సైతం ఒకరు డిజిటల్​ అరెస్ట్​ అయ్యారని సినీ నటుడు నాగార్జున (Nagarjuna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్మడి రవి అరెస్ట్​పై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పైరసీపై హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డిజిటల్‌ అరెస్ట్‌ గురించి మాట్లాడుతూ తమ కుటుంబంలోనూ ఒకరిని రెండు రోజులుపాటు నిర్బంధించారని ఆయన తెలిపారు. వాళ్లు ట్రాప్​ చేసి బెదిరింపులకు గురి చేస్తారన్నారు. ఆరు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే వారు తప్పించుకున్నారని చెప్పారు. పైరసీ సైట్లు (Piracy Sites) ఓపెన్​ చేసే వారు ఉచితంగా సినిమాలు చూస్తున్నామని అనుకోవద్దన్నారు. ఆయా సైట్ల నిర్వాహకులు ప్రజల డేటాను తీసుకొని మోసాలకు పాల్పడతారని హెచ్చరించారు. దీని వెనుక చాలా పెద్ద రాకెట్​ ఉందన్నారు.

Nagarjuna | పోలీసులకు ధన్యవాదాలు

మెగాస్టార్​ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ.. ఎంతోమంది కష్టాన్ని ఉచితంగా దోచుకోవడం సరికాదన్నారు. సినిమా రంగం ఎన్నో కష్టనష్టాలకోర్చి చిత్రాలను తీస్తున్నట్లు చెప్పారు. పైరసీతో ఎంతో మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నిర్మాత దిల్​రాజ్​ మాట్లాడుతూ.. పైరసీతో సినీ రంగానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందన్నారు. పైరసీకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకు రానున్నాయని ఆయన చెప్పారు. ప్రజలు పైరసీని ప్రోత్సహించొద్దని కోరారు. సినిమా థియేటర్లకు రాలేని వారు ఓటీటీల్లో చూడాలన్నారు. పైరసీ సైట్లను ఓపెన్​ చేస్తే ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు.

Must Read
Related News