అక్షరటుడే, బోధన్: Renjal | రోడ్డు ప్రమాదాలు నిత్యం పదుల సంఖ్యలో వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎడపల్లి మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
ఎడపల్లి మండలం(Yedapally Mandal) దూపల్లి గేట్ (Dupally Gate) వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడపల్లి ఎస్సై రమ తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు రాములు, ఇంద్ర కలిసి బైకుపై నిజామాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. వారు దూపల్లి గేట్ వద్దకు రాగానే.. రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. రాములు భార్య ఇంద్ర పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘