అక్షరటుడే, ఆర్మూర్: Armoor | గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor municipality) పరిధిలోని పెర్కిట్ శివారులో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
బాల్కొండ మండలం (Balkonda mandal) బోదేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (48) గురువారం ఉదయం ఆర్మూర్ పట్టణానికి తన ఎక్సెల్ వాహనంపై బయలు దేరాడు. జాతీయ రహదారిపై (national highway) పెర్కిట్ శివారులోని మీనాక్షి ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఆయన ఎక్సెల్ను ఢీకొంది. ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

