అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిలో జరిగింది. ఎస్సై మహేశ్ (SI Mahesh) కథనం ప్రకారం.. వెల్లుట్ల గ్రామానికి చెందిన పండుగల లక్ష్మణ్(36) బుధవారం బాన్సువాడలో (Banswada) పని నిమిత్తం బైక్‌పై వచ్చాడు.
అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తుండగా, అజామాబాద్ గ్రామం దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.