అక్షరటుడే, ఎల్లారెడ్డి: స్కూల్ బస్సు ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. ఈఘటన నాగిరెడ్డిపేట్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ పోచమ్మ ఆలయం రోడ్లో కేరళ స్కూల్ బస్సును బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దేవిసింగ్కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.