అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy District Judge | లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు బాధితురాలిపై దాడికి పాల్పడిన మహిళకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి వరప్రసాద్ (District Judge Varaprasad) సోమవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. లైంగిక దాడి బాధితురాలు తన తల్లితో బాన్సువాడలో (Banswada) నివసిస్తోంది. 2023 మార్చి 28న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి పనులు ముగించుకొని ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. కాగా.. బాధితురాలు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించినా ఆచూకీ దొరకలేదు.
దీంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో (Banswada police station) ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని సోమేశ్వర్ గ్రామానికి చెందిన మొగులయ్య మాయమాటలతో మభ్యపెట్టారు. బాధితురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించి సోమేశ్వర్ గ్రామానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో నిందితుడితో వివాహేతర సంబంధం ఉన్న మహిళ అక్కడికి వచ్చింది. వారిని చూసి మహిళ బాధితురాలిపై దాడి చేసింది. ఈ కేసులో బాధితురాలితో పాటు వారి కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని విచారించిన పోలీసులు మొగులయ్యతో పాటు భారతిని అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి ఇద్దరికి శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అభినందించారు.
Kamareddy District Judge | హత్యాయత్నం కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు
హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 2 వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుమలత సోమవారం తీర్పు వెల్లడించారు. బిచ్కుంద మండలం (Bichkunda mandal) ఖథ్గావ్ గ్రామానికి చెందిన పసుపుల చందు 2021 ఫిబ్రవరి 24న గ్రామం నుంచి పొలానికి వెళ్తున్న సమయంలో కుర్ల చౌరస్తా వద్ద పాత కక్షల కారణంగా అదే గ్రామానికి చెందిన రాథోడ్ శంకర్, రాథోడ్ మారుతి, పవర్ గణేష్ అడ్డగించి గొడ్డలి, కత్తులతో దాడి చేశారు. దాడిలో పసుపుల చందు తీవ్రంగా గాయపడ్డాడు. బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.