అక్షరటుడే, బాన్సువాడ: Banswada | జాతీయ రహదారిపై కల్వర్టు (Culvert) వద్ద నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైప్లో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్ మండలంలోని (Nasrullabad Mandal) దుర్కి శివారులో సోమవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులో కల్వర్టు వద్ద చేపలు పట్టేందుకు దేశాయిపేట్ గ్రామానికి (Desaipet village) చెందిన రాజు(28) వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ రోడ్డు పనుల్లో భాగంగా అమర్చిన పైప్లో రాజు ఇరుక్కున్నాడు. దీంతో బయటపడే అవకాశం లేకపోగా నీళ్లలో మునిగి మృతి చెంది ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.