Homeజిల్లాలునిజామాబాద్​Pothangal mandal | మంజీర నదిలో పడి ఒకరు మృతి

Pothangal mandal | మంజీర నదిలో పడి ఒకరు మృతి

రెండు నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి మంజీరలో శవమై తేలాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి నదిలో పడి చనిపోయాడు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Pothangal mandal | పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో మంజీర నదిలో (Manjira river) పడి ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ మండలం (Pothangal mandal) కారేగాం గ్రామానికి చెందిన బుడ్డ చిన్న బోయి (64) కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి మంజీరలో పడి మృతి చెందాడు.

చిన్నబోయి రెండు నెలల క్రితం అదృశ్యమైనట్టు అతని కుమార్తె దృపతి ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం సుంకిని శివారులో మృతదేహం లభించగా అతను ధరించిన షర్టు ఆధారంగా మృతుడు చిన్నబోయిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.