21
అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpalli | దుస్తులకు బురద అంటుకోవడంతో కడుక్కునేందుకు వరద కాలువలోకి దిగిన ఓ వ్యక్తి నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కమ్మర్పల్లి (Kammarpalli) మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
కమ్మర్పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి (SI Anil Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమిరే రాజేందర్ (47) నాగపూర్‌కు వెళ్తుండగా.. దుస్తులకు బురద అంటుకుంది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న వరద కాలువలోకి దిగి దుస్తులు శుభ్రం చేసుకుంటుండగా పట్టుతప్పి అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి (Armoor Government Hospital) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.